Jr NTR to set new TREND in dance PDF Print E-mail
(average 4.42 out of 5)

ntr-junior

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్, తమన్నా నటిస్తున్న చిత్రం ‘ఊసరవెల్లి’. టాలీవుడ్ డ్యాన్సర్స్ లో బెస్ట్ డ్యాన్సర్ గా జూ ఎన్టీఆర్ నిరూపించుకొన్నాడు. తన ప్రతీ సినిమాకి డాన్స్ ల్లో వేరియేషన్స్ చూపిస్తూ తన ఫ్యాన్సునే కాక ప్రేక్షకులని కూడా ఆశ్చర్య పరిచే టాలెంటెడ్ పర్సన్ జూ ఎన్టీఆర్. తను చిన్నప్పటి నుంచి నేర్చుకొన్న క్లాసికల్ డాన్స్ తను చేయబోయే హై ఎనర్జీ డాన్స్ ల కొత్త స్టెప్స్ కి చాలా ఉపయోగపడుతోంది.
జూ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తను నటిస్తున్న (ఊసర వెల్లి టైటిల్ నిర్ణయించలేదు) చిత్రంలో ఓ కొత్త ఫీట్‌ని చేయబోతున్నాడు. తన దైన మార్క్ యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే క్రేజీ హీరోగా ఎదిగిన జూఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు డాన్సుల్లోనూ అదరగొడతాడన్న విషయం తెలిసిందే.
అయితే సురేందర్‌డ్డి దర్శకత్వంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం జూ ఎన్టీఆర్‌ పై ఓ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాటకు తెలుగు చిత్ర పరిక్షిశమలోని టాప్ డాన్స్ మాస్టర్లలో ముగ్గురు నృత్యరీతులు సమకూర్చనున్నారని క్లాసికల్ వెస్ట్రన్ రీమిక్స్ బీట్ ఇలా మూడు వేరియేషన్స్ లో సాగే ఈ పాట ట్రెండ్ సెట్టర్‌ గా నిలవనుందని సమాచారం.



Add this page to your favorite Social Bookmarking websites