ఎన్టీఆర్ తో రాజమౌళి “పాతాళభైరవి” PDF Print E-mail
(average 4.78 out of 5)

“విశ్వ విఖ్యాత నట సార్వభౌమ” ఎందరో నటీ నటులకు వెండి తెర వేల్పు అయిన స్వర్గీయ నందమూరి  తారకరామారావు నట చరిత్రలోనే మకుటాయమానం గా నిలిచిపోయిన చిత్రం “పాతాల భైరవి”. తెలుగు సినీ చరిత్రలోనే ఎంతో మంది దర్శకులకి ‘పెద్ద బాలశిక్ష’ లాంటి ఆ చిత్రాన్ని ఈ మధ్య ఎందరో నిర్మాతలు రీ మేక్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఎవ్వరూ  దాన్ని కార్యాచరణలో పెట్టే సాహసం చేయలేకపోయారు. కె.వి రెడ్డి దర్శకత్వంలో విజయా బ్యానర్ పై వచ్చిన “పాతాల భైరవి” చిత్రం అంతటి వైభవం కలది కనుకనే ఒక ఆణిముత్యమై చరిత్ర ఒడిలో ఒదిగిపోయింది.

 

ఇక తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చారిత్రాత్మక చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఇందులో హీరోగా నటించడానికి ఆతృతతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. “యమదొంగ” చిత్రం ద్వారా చిన్న తారక రాముడి నటనా ప్రావీణ్యాన్ని తారాస్థాయికి చేర్చిన రాజమౌళి ఈ “పాతాల భైరవి” రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తేనే,  తమ ఈ సాహస ప్రయత్నానికి న్యాయం జరుగుతుందని  జూ: ఎన్టీఆర్ కూడా భావిస్తున్నట్టు వినికిడి.

Source:maastars.com



Add this page to your favorite Social Bookmarking websites