“బృందావనం” లో శ్రీహరి? PDF Print E-mail
(average 4.80 out of 5)

విలక్షణ నటుడు శ్రీహరి ఎన్టీఆర్ నటిస్తున్న “:బృందావనం” లో నటిస్తున్నారా?… అవుననే అంటున్నాయి…పరిశ్రమ వర్గాలు. శ్రే వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జూ:ఎన్టీఆర్, సమంత, కాజల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఒక ప్రధానమైన పాత్రలో నటించడానికి దర్శకుడు వంశీ పైడిపల్లి వెళ్ళి శ్రీహరిని సంప్రదించాడు. “మగధీర” చిత్రం తరువాత అలాంటి సపోర్టింగ్ పాత్రలు వేయడం మానివేసిన శ్రీహరి సారీ చెప్పి పంపించేసాడట.

కానీ ఆ పాత్రకున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఎన్టీఆర్ చొరవతో శ్రీహరి ఇందులో నటించనున్నాడని తెలిసింది.   తమన్ సంగీతం సమకూరుస్తున్న “బృందావనం” కి, చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. ఆగస్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Source:maastars.com



Add this page to your favorite Social Bookmarking websites